
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ నటి ఐశ్వర్యరాయ్‌పై కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ మంత్రిని కోరింది.మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని మంత్రికి కమిషన్ నోటీసులు పంపింది.
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో మంత్రి చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ఐశ్వర్య రాయ్ బచ్చన్ క్రమం తప్పకుండా చేపలు తినడం వల్ల ఆమె కళ్ళు అందంగా ఉన్నాయని గవిత్ అన్నారు. " మీరు ఐశ్వర్యరాయ్ కళ్లను చూసి ఉంటారు. అవి చాలా అందంగాఉంటాయి. ఆమె కర్నాటకలోని మంగళూరు తీర ప్రాంతంలో నివసించింది. ఆమె క్రమం తప్పకుండా చేపలు తినడంతోనే ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి" అని అన్నారు.
ALSO READ : కూరలో ఉప్పు ఎక్కువైంది : రెస్టారెంట్ లో ఫైటింగ్..
రోజూ చేపలను తినే వ్యక్తులకు మృదువైన చర్మం ఏర్పడుతుంది. వారి కళ్ళు మెరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ వైపు ఆకర్షితులవుతారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మంత్రి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్‌సిపి శాసనసభ్యుడు అమోల్ మిత్కారీ అన్నారు.