
ఆహారంలో ఉప్పు ఎక్కువైందని అన్నందుకు ఓ కస్టమర్‌పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమర్ దేశ రాజధానిలోని ఓ రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వచ్చాడు.
అతనికి వడ్డించిన ఫుడ్‌లో ఉప్పు మోతాదు ఎక్కువైంది. ఆగ్రహించిన కస్టమర్ సిబ్బందిని నిలదీశాడు. సిబ్బందికి అతనికి మధ్య మాటా మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.
ALSO READ l: తమ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశారని కొడవళ్లతో దాడి
విచక్షణ కోల్పోయిన సిబ్బంది కస్టమర్‌పై దాడికి దిగారు. కస్టమర్సైతం ప్రతి దాడి చేశాడు. ఈ దాడిలో కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చుట్టూ ఉన్నవారు కనీసం గొడవను ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.