అట్టహాసంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్

అట్టహాసంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ - 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘పొన్నియన్ సెల్వన్‌ - 1’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు డ్రెస్ లో ఐశ్వర్య వెరీ వెరీ స్పెషల్ గా కనిపించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ నటులు విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, జయం రవి కూడా పాల్గొన్నారు. ‘పొన్నియన్ సెల్వన్‌ - 1’  మూవీలో ఐశ్వర్యా రాయ్ తో పాటు వీరంతా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నందిని అనే రాజకుమారి పాత్రలో..

ఇది చోళ రాజుల కాలం నేపథ్యంలో సాగే చారిత్రక కథా చిత్రం. ఇందులో నందిని అనే రాజకుమారి పాత్రను ఐశ్వర్యరాయ్‌ పోషించారు.  ప్రతీకారంతో రగిలిపోయే యువతిగా యాక్ట్ చేశారు. పాండియన్‌ దేశానికి చెందిన యువతిగా.. ప్రేమికుడైన వీర పాండియన్‌ ను తన కళ్ల ముందే శిరచ్ఛేదనం చేసిన చోళ రాజు ఆదిత్య కరికాలన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి కుట్రపన్నే రాణిగా నటించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినప్పుడే మణిరత్నం నందిని పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని ఫిక్స్‌ అయ్యారట. 

ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు..

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. ఈ నెల 30న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో రూ.24 కోట్ల భారీ మొత్తం చెల్లించి టిప్స్ మ్యూజిక్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను దక్కించుకుందని సమాచారం.