రీసెంట్‌గా ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సక్సెస్ అందుకుని మంచి జోష్‌లో ఉన్న తిరువీర్ తాజాగా తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.
ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
