మెట్రో పార్కింగ్ ఛార్జీలు రద్దు చేయాలి : ఏఐవైఎఫ్ ప్రజా ఉద్యమం

మెట్రో పార్కింగ్ ఛార్జీలు రద్దు చేయాలి : ఏఐవైఎఫ్ ప్రజా ఉద్యమం

 మెట్రో రైల్ ప్రయాణికుల నుంచి పార్కింగ్ చార్జీలు వసూళ్ళు రద్దు చేయాలంటూ ఏఐవైఎఫ్ ప్రజా ఉద్యమం మొదలు పెట్టింది.  మెట్రో సంస్థ, ఎల్ అండ్ టి సంస్థలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఆగస్టు 29 న రం యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గర ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read:-17 మంది మలయాళీ నటులపై కేసులు

 ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మేంద్ర.. మెట్రో ప్రయాణికులకు ఉచిత  పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదేనన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని, వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా .. పార్కింగ్ చార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు.  తక్షణమే నాగోల్, మియాపూర్, మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.