స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అజయ్‌‌దేవగన్

 స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో అజయ్‌‌దేవగన్

అజయ్‌‌దేవగన్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన చిత్రం ‘మైదాన్’. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. ప్రముఖ ఫుట్‌‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియమణి  కీలక పాత్ర పోషించింది. జీ స్టూడియోస్, బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదలవ్వాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. మంగళవారం ఫైనల్ రిలీజ్ డేట్‌‌ని అనౌన్స్ చేశారు. జూన్ 23న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో  సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 30న టీజర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు చెబుతూ ‘ఒక మనిషి, ఒక నమ్మకం, ఒక ఆత్మ, ఇదొక నిజమైన  కథ’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అజయ్ దేవగన్.  ఇందులో అజయ్ ఫుట్ బాల్ కోచ్‌‌గా కనిపించనున్నాడు.