బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ యాక్షన్ సినిమాలకు పెట్టిందిపేరు. కాగా గతంలో అజయ్ దేవగన్
హీరోగా నటించిన రైడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు దర్శక నిర్మాతలకి మంచి కాసుల పంట పండించింది..
దీంతో చిత్ర యూనిట్ రైడ్ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసారు. ఈ క్రమంలో రైడ్ -2 చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీంతో ఈ ఏడాది నవంబర్ 15, 2024న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఏమయిందో ఏమోకానీ సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఉన్నట్లుండి తాజాగా రైడ్ -2 చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తారీఖున విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి పలు పోస్టర్లు కూడా విడుదల చేసారు.
ఈ విషయం ఇలా ఉండగా రైడ్ చిత్రాన్ని ఇటీవలే టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేసి విడుదల చేసారు. కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Bringing back the action, intensity, and suspense your way! #Raid2 releasing on 21st February 2025!@ajaydevgn @Riteishd @Vaaniofficial #RajatKapoor @rajkumar_rkg #BhushanKumar #KrishanKumar @KumarMangat @AbhishekPathakk @PanoramaMovies #ShivChanana @neerajkalyan_24 pic.twitter.com/SxBoKUWYxT
— T-Series (@TSeries) September 11, 2024