లవ్ ఎప్పుడూ హ్యాపీనెస్‌‌ తేదండోయ్.. అజయ్ గాడు

లవ్ ఎప్పుడూ హ్యాపీనెస్‌‌ తేదండోయ్.. అజయ్ గాడు

ఇటీవలే ‘విశ్వక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజయ్‌ కతుర్వార్‌’ హీరోగా ‘అజయ్ గాడు’ సినిమా తెరకెక్కుతోంది. అజయ్ కుమార్ ప్రొడక్షన్ లో చందన కొప్పిశెట్టి  సహకారంతో నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ‘మన లైఫ్ లో ఉండే కామన్ ఏమోషన్ లవ్... మన ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చొు.. ఫ్రెండ్స్ పై కావొచ్చు..కెరియర్ పై కావొచ్చు.. మన లవర్ పై కావొచ్చు’.. అంటూ టీజర్ స్టార్ట్ అవుతుంది. లవ్ ఎప్పుడూ హ్యాపీనెస్ తేదొండోయ్ అంటూ హీరో ఇతరులతో ఫైటింగ్ చేస్తాడు. యూత్ ని ఆకట్టుకొనే విధంగా మూవీని రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమౌతుంది.

అజయ్ నాగ్, హర్ష హరి జాస్తిలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. మనీజేన, కార్తీక్ కొడకొండ్ల, సుమంత్ బాబు, ప్రతీక్ సంగీతాన్ని అందిస్తుండగా.. సిద్ధార్థ్ శివుని సంగీతాన్ని సమకూర్చారు.  భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీ షో నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా అజయ్ కతుర్వార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే వెండితెరపై కనిపించాడు.