
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ములేకే తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఏఐసీసీ తెలంగాణ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి అజయ్ కుమార్ ఘోష్ అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను చూసి బీఆర్‌ఎస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే తమపై ఐటీని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్, మజ్లిస్ లీడర్ల అవినీతి, అక్రమాలు బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలను వదిలేసి కాంగ్రెస్ లీడర్లను టార్గెట్ చేశారన్నారు.