
స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు ఎంత ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బుమ్రా బెస్ట్ బౌలర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బుమ్రా గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఫార్మాట్ ఏదైనా బుమ్రా మ్యాచ్ లో ఉంటే టీమిండియా బౌలింగ్ కు కొండంత ధైర్యం. అయితే పని భారం కారణంగా బుమ్రా చాలా మ్యాచ్ లకు దూరమవుతున్నాడు. ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025లో గాయపడిన బుమ్రా.. అక్కడ నుంచి కీలక మ్యాచ్ ల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకుంటున్నాడు. బీసీసీఐ కూడా బుమ్రా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఆ తర్వాత కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కూడా మూడు టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ కీలక మ్యాచ్ లకు దూరం కావడం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తాజాగా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే బుమ్రా వర్క్ లోడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. యు ట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తూనే వర్క్ లోడ్ ఉన్నప్పటికీ ఎలా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాలో చెప్పుకొచ్చాడు.
రహానే మాట్లాడుతూ.. "బుమ్రాలో నాకు నచ్చినది ఏమిటంటే అతను చాలా క్లియర్ గా ఉన్నాడు. ఈ సిరీస్‌కు ముందు అతను ఏం చేయాలనుకుంటున్నాడో స్పష్టంగా చెప్పాడు. మొదట టెస్ట్ ఆడతాను. రెండో టెస్ట్ ఆడను. మూడో టెస్ట్ ఆడతాను అని చాలా ధైర్యంగా క్లియర్ గా చెప్పాడు. కెప్టెన్‌కు గొప్ప క్లారిటీ ఇస్తున్నాడు. బుమ్రా ప్రత్యేకమైన యాక్షన్ కారణంగా అతని శరీరంపై చాలా భారం ఉంది. బుమ్రా ఐదు టెస్టులూ ఆడాలని భావిస్తే మూడు లేదా నాలుగు ఓవర్ల స్పెల్ అతని చేత వేయించాలి. సుదీర్ఘ స్పెల్స్ వేయించకుండా జాగ్రత్త పడుతూ చిన్న స్పెల్స్ వేసేలా చూడాలి". అని రహానే సూచించాడు.
ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో బుమ్రా మూడు టెస్టులు ఆడాడు. లీడ్స్‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌హామ్‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. ముగిసిన మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి. ఓవల్ లో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు.
Ajinkya Rahane proposes a strategy for utilizing Jasprit Bumrah effectively in a five-match Test series.#TeamIndia #JaspritBumrah pic.twitter.com/XCHxWwK02l
— Circle of Cricket (@circleofcricket) August 9, 2025