- ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
న్యూఢిల్లీ: దేశంలోని పరిశ్రమలు టెక్నా లజీ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టా లని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే శ్రామిక శక్తిని.. ప్రపంచంతో పోటీపడే లా తయా రు చేయాలని పిలుపుని చ్చారు. శనివా రం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ఢిల్లీలో 'నేతాజీ సుభాష్ చంద్రబోస్' మెమోరి యల్ లెక్చర్ ప్రోగ్రా మ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దోవల్ హాజరై మాట్లా డారు. మన దేశా నికి మానవ వనరులే అతిపెద్ద బలమని అన్నారు.
నిబద్ధత కలి గిన దేశ శ్రామిక శక్తిలో మంచి నైపుణ్యా లను అభివృద్ధి చేసి.. వారిని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ఎవ్వరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, నిన్నటి కంటే ఈ రోజు బెటర్‌గా చేయాలన్నారు. కాగా, నేతాజీ కనుక ప్రాణాలతో ఉండి ఉంటే దేశం రెండుగా విడిపోయేదే కాదని అన్నారు. నేతాజీ చెబితే మాత్రమే వింటా నని జిన్నా చెప్పిన మాటలను గుర్తుచేస్తూ దోవల్ ఈ కామెంట్ చేశారు.
