న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడారు. దేశాభివృద్ధిలో, సామాజిక సంస్కరణల అమలులో జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.
