ఎల్బీనగర్, వెలుగు: వైట్ నంబర్ ప్లేట్ కారుతో ప్రయాణికులను తరలిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని కారును సీజ్ చేశారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, పొలదాసు సురేశ్ అనే యువకుడు వైట్ నంబర్ ప్లేట్ కారుతో ఎల్బీనగర్ నుంచి సూర్యాపేటకు ప్రయాణికులను తరలిస్తున్నాడు. ఓవర్ స్పీడ్, నో పార్కింగ్, రాంగ్ రూట్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు తరచుగా చేస్తుండటంతో పోలీసులు ఆ వాహనంపై నజర్ పెట్టారు. పలుమార్లు తప్పించుకున్నప్పటికీ ఆదివారం చివరకు అతడిని పట్టుకున్నారు.
వాహనంపై పెండింగ్ చలాన్లను పరిశీలించగా మొత్తం 95 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. చలాన్లు క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించగా సురేశ్ నిరాకరించడంతో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం వాహనంతో పాటు సురేశ్‌ను కోర్టులో హాజరుపరుస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వాహనాన్ని పట్టుకున్న ఎస్సై రవికుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ నాయక్‌లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
