మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) నేత అజిత్‌ పవార్‌ నియమితులయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్‌పవార్‌ తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తిరిగి NCP లోకి వచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.