
భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సింగర్ సమర్ సింగ్ ను పోలీసులు ఘజియాబాద్ లో అరెస్టు చేశారు. మార్చి 26, 2023న ఆత్మహత్య ఆకాంక్ష దూబే వారణాసిలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. లైక్ హూన్ మై నాలైక్ నహిన్ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ఆమె ఆత్మహత్యకు సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ ను బాధ్యులను చేస్తూ ఆకాంక్ష తల్లి ఆరోపించారు. దీంతో వారిద్దరిపై పోలీసులు గత కొన్ని రోజుల క్రితమే కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఘజియాబాద్‌లో సమర్ సింగ్ ఉన్నట్టు సమాచారం రావడంతో.. సోదాలు చేసి, అతన్ని అరెస్టు చేశారు.
నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యాయత్నానికి కొన్ని గంటల ముందు ఇన్స్ స్టాగ్రామ్ లో లైవ్ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆకాంక్ష ఏడుస్తూ కనిపించడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె 2018 లో డిప్రెషన్‌తో బాధపడ్డారని, అందుకే వృత్తిపరంగా కాస్త గ్యాప్ తీసుకుని, మళ్లీ ఇండస్ట్రీకి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేశారు. ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే KI 2 లాంటి ఇతర ప్రాజెక్ట్‌లలోనూ అలరించారు.