ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ పెట్టాలి : అక్బరుద్దీన్

ఓల్డ్ సిటీ  అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ పెట్టాలి : అక్బరుద్దీన్

ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.  ఇమామ్ లకు రూ.12 వేలు కాదు రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం మదర్సా బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్నికల్లో   కాంగ్రెస్, బీజేపీ ఒక్క ముస్లీం అభ్యర్థిని కూడా గెలిపించలేకపోయాయన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ.  కాంగ్రెస్,బీజేపీ ముస్లీంల అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు.  కాంగ్రెస్ కు ముస్లీంలు దగ్గరగా ఉన్నారంటే  వైఎస్సారే కారణమని చెప్పారు.  వైఎస్ హయాంలో  మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. 

షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ.  ఎస్సీ,ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. మైనార్టీల విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.  ఓల్డ్ సిటీలో రోడ్లు వెడల్పు పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు అక్బరుద్దీన్ ఓవైసీ.