అఖండ 2 నుంచి బిగ్ అప్ డేట్.. త్రీడీలో తాండవం రిలీజ్

అఖండ 2 నుంచి బిగ్ అప్ డేట్.. త్రీడీలో తాండవం రిలీజ్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న  చిత్రం  ‘అఖండ2 : తాండవం’.   ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.  

ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి  బిగ్ అప్‌‌‌‌డేట్‌‌‌‌ ఇచ్చారు మేకర్స్.  ఈ చిత్రాన్ని  త్రీడీలోనూ రిలీజ్‌‌‌‌ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారి అభిమానులు,  ప్రేక్షకులకు  గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే  ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్‌‌‌‌లోనూ తీసుకొస్తున్నాం.  

ఈ చిత్రం  భారతదేశ ఆత్మ, పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. భగవద్గీత, రామాయణం, మహా భారతం.. ఇవి మన దేశ ఆత్మ.  

ఈ మూడింటికి ఉన్న ఆత్మే ఈ చిత్రం’ అని అన్నారు. త్రీడీలో ఈ చిత్రం ఆడియెన్స్‌‌‌‌కు విజువల్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను అందించబోతోందని నిర్మాతలు అన్నారు. నటుడు రచ్చ రవి,  డిఓపి సంతోష్,  ఎడిటర్ తమ్మి రాజు పాల్గొన్నారు.