Zainab Ravdjee Birthday: 40వ వసంతంలోకి అడుగుపెట్టిన అఖిల్ భార్య.. బర్త్ డే ఫోటోలు వైరల్

Zainab Ravdjee Birthday: 40వ వసంతంలోకి అడుగుపెట్టిన అఖిల్ భార్య.. బర్త్ డే ఫోటోలు వైరల్

అక్కినేని వారి చిన్న కోడలు, అఖిల్ భార్య జైనాబ్ రవ్జీ మంగళవారం (Sept 9తో) 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జైనాబ్ పుట్టినరోజును అఖిల్ గ్రాండ్గా సెలెబ్రేట్ చేశారు. ఈ క్రమంలో జైనబ్తో కలిసున్న ఓ బ్యూటిఫుల్ ఫోటో పంచుకున్నారు. `హ్యాపీ బర్త్‌డే మై లైఫ్` అనే క్యాప్షన్తో అఖిల్ తనకు విషెష్ తెలిపారు. ఈ బర్త్ డే పార్టీ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు సమాచారం. 

ఈ వేడుకలో భర్త అఖిల్ అక్కినేనితో పాటుగా నాగార్జున, అమల, నాగ చైతన్య పాల్గొన్నారు. అయితే, అక్కినేని ఇంటి పెద్ద కోడలు శోభిత మిస్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్లో బిజీ ఉండటం వల్ల రాలేదని టాక్. అయితే, ప్రస్తుతం జైనాబ్ బర్త్ డే పార్టీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో, కారులో నుంచి దిగిన చైతన్యను అఖిల్‌ స్వాగతించి హాగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నాగ్ ఎంట్రీ ఇచ్చి.. జైన‌బ్ బ‌ర్త్ డే ఈవెంట్ ఏర్పాట్లు చూస్తున్నట్టు కనిపించింది. ఇకపోతే, అఖిల్-జైనబ్లు ఈ ఏడాది 2025 జూన్6న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అఖిల్ కంటే తన భార్య జైనాబ్ 8 ఏళ్లు పెద్దది. ప్రస్తుతం అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా.. జైనాబ్‍కు 40 కావడం విశేషం. 

జైనాబ్ ర‌వ్జీ బ్యాక్గ్రౌండ్:

అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ ర‌వ్జీ ముంబైకి చెందిన కళాకారిణి. స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్టు. ఇప్పటికే తన పెయింటింగ్స్తో హైదరాబాద్, ముంబయి, ఢిల్లి, లండన్, దుబాయ్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. 

ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ కుమార్తెనే జైనాబ్ రవ్జీ. ప్రస్తుతం జుల్ఫి రవ్జీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగంలో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నాడు. జైనాబ్ సోదరుడు జైన్ రావ్జీ, భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో 'ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు' ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. జైనాబ్ రవ్జీ ఫ్యామిలీకి బంజారాహిల్స్ రోడ్ నంబర్.7లో సొంత ఇల్లు కూడా ఉన్నట్లు సమాచారం.

జైనాబ్ తండ్రి జుల్ఫీ ర‌వ్జీ, హీరో నాగార్జున మంచి ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహమే అఖిల్, జైనాబ్ల ప్రేమకు మార్గం సుగమమైంది. ఇకపోతే హైద‌రాబాద్‌లో పుట్టిన జైనాబ్.. దుబాయ్‌లో పెరిగింది.