లెనిన్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అఖిల్

లెనిన్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న అఖిల్

అక్కినేని  అఖిల్ హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతోన్న  చిత్రం ‘లెనిన్’.  అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ  నిర్మిస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న 6వ చిత్రమిది. శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. 

రాయలసీమ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. దీంతో దాదాపు షూట్ పూర్తవనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ సెకండ్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. విడుదల తేదీపై  త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రానుంది. 

ఈ చిత్రంలో  అఖిల్ రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. చిత్తూరు యాసలో డబ్బింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.