అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ లాంచ్

అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ లాంచ్

త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘అక్కడ వారు ఇక్కడ ఉన్నారు’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను టీఎఫ్‌‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్,  తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్ కలిసి లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా త్రివిక్రమ రావు మాట్లాడుతూ ‘ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కొత్తవాళ్లే. అయినా అనుభవం ఉన్నవాళ్లలా చేశారు. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా సినిమా  ఉంటుంది’ అని చెప్పాడు.