
అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏంటి ఇలా మారిపోయాడు? ఏదైనా సినిమా కోసం ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నాడా? లుక్ మాత్రం అదిరిపోయింది? ఇంతకీ ఏ సినిమా కోసం? దర్శకుడు ఎవరు? ఇవి ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. అవును.. తాజాగా అక్కినేని అఖిల్ కు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ లుక్ ఎందుకోసం అంటే?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత ఒక్క హిట్ కూడా లేదు అఖిల్ కి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతోంది. కానీ, ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ సినిమాను చేస్తున్నాడు అఖిల్ అంటూ ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనుండని, పీరియాడికల్ డ్రామాగా రానున్న ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కనుందని టాక్ నడిచింది.
అయితే.. ఈ ప్రాజెక్టుపై మేకర్స్ నుండి కానీ, అఖిల్ నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ లుక్ తో మరోసారి ఈ సినిమా టాపిక్ తెరపైకి వచ్చింది. ఈ కొత్త లాంగ్ హెయిర్ లుక్ కూడా ఆ సినిమా కోసమే అని తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న సినిమా కావడంతో ఈ లాంగ్ హెయిర్ లుక్ మెయింటన్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకనట రానుంది. మరి చాలా గ్యాప్ తరువాత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.