
కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలోని అక్షయ విద్యా ఫౌండేషన్‌కు ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా రెండు బస్సులు కేటాయిస్తామని సంస్థ ఎండీ వి.సి.సజ్జనార్ అన్నారు. ఫౌండేషన్నిర్వాహకులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
సైన్స్సెంటర్ప్రారంభిస్తున్నామని, ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తామని తెలిపారు. సెంటర్‌కు చేరుకోవడానికి పిల్లలకు రవాణా సదుపాయం కల్పించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్టి.ప్రసాద్, గవర్నింగ్‌బాడీ సభ్యుడు మురళీధర్, ప్రాజెక్ట్హెడ్ శ్రీనివాస్, మేనేజర్ హైమా తదితరులున్నారు.