
హైదరాబాద్, వెలుగు: ‘కేసీఆర్‌ది పచ్చి మోస కారి ప్రభుత్వం.. పేదల విద్యను ధ్వంసం చేయడమే ఆయన ఉద్దేశం’ అని సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా సీఎంపై విమర్శ లు చేశారు. ‘గురువారం ఎస్‌డీఎఫ్ టీమ్ సరూర్‌నగర్ భూపేశ్ గుప్తా నగర్‌లో 300 మంది పిల్లలు ఉన్న ప్రైమరీ స్కూల్‌ను సంద ర్శించింది. స్కూల్ ఆవరణ అంతా చెత్తగా ఉంది. ఈ స్కూల్‌కు మన ఊరు – మన బడి ఫండ్స్ మంజూరై ఏడాదైనా ఒక్క రూపాయి ఖర్చు కాలేదు’ అని మురళి ట్వీట్ చేశారు.