గత ప్రభుత్వ జీవోలన్నీ వెబ్‌‌సైట్‌‌లో పెట్టాలి: ఆకునూరి మురళి

గత ప్రభుత్వ జీవోలన్నీ వెబ్‌‌సైట్‌‌లో పెట్టాలి: ఆకునూరి మురళి

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్​ సర్కారు గతంలో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను వెబ్​సైట్​లో పెట్టకుండా చీకటి పాలన చేసిందని, కొత్త ప్రభుత్వం అన్ని  జీవోలు, మెమోలు పబ్లిక్​ డొమైన్​లో పెట్టాలని మాజీ ఐఏఎస్‌‌ ఆకునూరి మురళి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌‌రెడ్డి, తెలంగాణ సీఎంవోను ట్యాగ్‌‌ చేస్తూ శుక్రవారం ట్వీట్‌‌ చేశారు. 

జీవోలను పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ వెబ్‌‌సైట్​లో పెడితే బాగుంటుందని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లలో సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచితే పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. జీవోలన్నీ వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుని పారదర్శక పాలన చేయాలని ఆకునూరి మురళి  కోరారు.