కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలే గతి..ఆకునూరి మురళీ ఫైర్

కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలే గతి..ఆకునూరి మురళీ ఫైర్

సీఎం కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని రిటైర్డ్ ఐఏఎస్ ఆకూనూరి మురళీ ఆరోపించారు. ఇంటికో  ఉద్యోగం అని చెప్పి.. 20, 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. అధికారంలో నుండి దిగగానే కేసీఅర్ అయిన కుంటుబ సభ్యులు చంచల్ గూడా.. చర్ల పల్లి జైల్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. రైతుల భూములు లాక్కుంటూ విదేశాల్లో కేసీఆర్ కుటుంబం అక్రమంగా పెట్టుబడులు పెడుతుందని విమర్శించారు. కోట్లు ఖర్చు చేసి గడిలాగా ప్రగతి భవన్ ను నిర్మించారని..కేసీఆర్ గద్దె దిగాక..ప్రగతి భవన్ ఆసుపత్రి అవుతుందన్నారు. 

TSPSC పేపర్ల లీకేజిని నిరసిస్తూ.. అఖిల పక్ష భరోసా పేరుతో హైదరాబాద్ ఇందిర పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అందులో ఆకూనూరి మురళీ పాల్గొన్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్, బీఎస్పీ, జనసమితి, న్యూ డెమోక్రసీ పార్టీల నేతలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. TSPSC చైర్మన్, కార్యదర్శి, బోర్డు సభ్యులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని కోరారు.