అందుబాటులోకి మన టిక్ టాక్ యాప్స్..

అందుబాటులోకి మన టిక్ టాక్ యాప్స్..

మన టిక్ టాక్ యాప్స్.. హైస్టార్.. అలాప్
అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ టెకీలు

టిక్ టాక్ బ్యాన్ కావడంతో సోషల్ మీడియా లవర్స్ అసంతృప్తికి గురయ్యారు. మళ్లీ అలాంటి యాప్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ లోటును భర్తీ చేసేందుకు హైదరాబాద్ నుంచే కొత్త యాప్స్ వస్తున్నాయి. హైద‌‌రాబాద్‌‌కు చెందిన ప‌‌బ్బాస్ ఇన్నోవేష‌‌న్ రూపొందించిన హైస్టార్ యాప్ ను ఇప్పటికే లాంచ్ చేశారు. ఇది ఇండియా, అమెరికా కేంద్రాలుగా కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ అసోసియేష‌‌న్ (టీటా) స్టార్టప్ కమ్యూనిటీ ద్వారా రూపొందించిన ‘అలాప్’ యాప్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

హైస్టార్.. బీ సూపర్ స్టార్
ఇండిపెండెన్స్ డే రోజున హైస్టార్ యాప్ ను లాంచ్ చేశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న ఈ యాప్.. షార్ట్ వీడియో లవర్స్‌‌‌‌కు హాట్ ఫేవ‌‌రేట్‌గా మారనుందని నిర్వాహకులు చెబుతున్నారు. 3 నుంచి 60 సెకన్ల నిడివి ఉండే లిప్‌‌ సింక్‌‌ వీడియోలు ఈ యాప్ లో ఉంటాయి. మనం మన గొంతుతో ప్రత్యేకంగా వీడియోలూ చేయొచ్చు. వాటికి బ్యాక్‌‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ‌కలపొచ్చు. హైస్టార్ యాప్‌ ‌ఓపెన్‌ చేయగానే దానిలో యూజర్లు అప్‌‌లోడ్‌ చేసిన ఇలాంటి ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. ఇవి నచ్చితే లైక్ కొట్టొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఎవరి వీడియోలైనా బాగా నచ్చితే వాళ్లను ఫాలో కావచ్చు. ఆ వీడియోల కింద ఉండే ఆప్షన్‌ ద్వారా అదే మ్యూజిక్‌‌/ డైలాగ్‌కు మనం కూడా లిప్‌‌సింక్‌‌ఇచ్చి, ఆ క్లిప్‌‌ను అప్‌‌లోడ్‌
చేయొచ్చు.. ఫ్రెండ్స్‌‌తో షేర్‌ చేసుకోవచ్చు. ఈ యాప్ లో కామెడీ డైలాగ్స్, ఇన్‌‌స్పిరేషనల్ కోట్స్, పాటలు, సినిమా క్లిప్పింగ్‌ లు, వంటలు.. ఇలా బోలెడు రకాలు ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని వీడియోలు చేయొచ్చు. వీడియోల నిడివి తక్కువ, వినియోగించడం సులభం కావడంతో ఈ యాప్ యూత్ ను అట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు నిర్వాహకులు. ఈ యాప్ లో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించిన వారిని ‘హైస్టార్ ’గా గుర్తించి కంపెనీల అడ్వర్టయిజ్ మెంట్లలో నటించే అవకాశం కూడా కల్పిస్తారు. ఓవైపు పాపులారిటీతో, మ‌‌రోవైపు సంపాదన ఈ యాప్ తో సాధ్యమవుతుంది. మొత్తానికి ‘హైస్టార్ .. బీ సూపర్‌ స్టార్ ’ అంటూ వచ్చిన ఈ యాప్ యూత్‌‌ను ఆకట్టుకుంటోంది.

ప్లేస్టోర్ లోకి ‘హైస్టార్’ వచ్చేసింది
మేడిన్ ఇండియా యాప్లకు టైమ్ వచ్చింది. పబ్బాస్ ఇన్నోవేషన్ రూపొందించిన హైస్టార్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో ఉంది. టిక్‌టాక్‌‌లో లేని సూప‌‌ర్ ఫీచ‌‌ర్స్ మా యాప్‌‌లో ఉన్నాయి. లైఫ్‌‌స్టైల్, ఎంటర్‌టైన్మెంట్, మ్యూజిక్, న్యూస్… ఇలా ఎన్నో రకాల వీడియోలు చేసుకునే అవకాశం ఉంటుంది. పాపులారిటీ సంపాదించిన వారికి అడ్వర్టయిజ్ మెంట్ అవకాశాలు కల్పిస్తాం.
– స్వామి ముద్దం, సీఈవో, హైస్టార్ యాప్

అదిరిపోయే ‘అలాప్’
టిక్ టాక్ యాప్ కంటే అదిరిపోయే ఫీచర్లతో మేడిన్ హైదరాబాద్‌ ‌యాప్ త్వరలో రానుంది. తెలంగాణ ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాలజీ అసోసియేష‌‌న్ (టీటా) స్టార్టప్ క‌‌మ్యూనిటీ ద్వారా ‘అలాప్’ యాప్ అందుబాటులోకి వస్తోంది. 13 భాష‌‌ల్లో అందుబాటులోకి రానున్న ‘అలాప్‌‌’ యాప్‌‌ టీజర్‌, లోగోను ఇటీవల టీటా గ్లోబ‌‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌‌క్తాల ఆవిష్కరించారు. టెక్నాలజీ, డేటా సెక్యూరిటీ అంశాలపై ఫోకస్ పెట్టడంతో పాటు ఇన్ కమ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేడిన్ ఇండియా యాప్ తేవాలనే ఆకాంక్షతో ‘అలా‌‌ప్‌‌’ ను రూపొందిచమని సందీప్ తెలిపారు. కరోనా టైమ్ లో ఉత్సాహవంతులైన సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ కు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ-సాఫ్ట్ ల్యాబ్‌‌‌) కంపెనీ టీమ్ ఈ యాప్ ను రూపొందించింది. కొందరు టెకీలు సొంతంగా డబ్బులు పెట్టుకొని దీనిని తయారుచేశారు.

వచ్చే నెలలోనే ‘అలాప్’ వస్తది
ప్రజలు మేడిన్ ఇండియా యాప్స్‌‌ వైపు చూస్తున్నారు. అలాప్ యాప్ వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ కావడానికి సుమారు 15 రోజుల టైమ్ పడుతుంది. ఈ యాప్ డెవలప్ మెంట్ తో సుమారు 100 మందికి ఉపాధి కల్పించాం. రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి కల్పిస్తాం. ఈ యాప్ ను అందరూ ఆదరించాలి.
– సందీప్ మక్తాల, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్

For More News..

సెప్టెంబర్ 16 నుంచి జేఎన్టీయూ ఎగ్జామ్స్!

భారీ వర్షాలకు కూలిన హైటెన్షన్ టవర్లు

కన్ఫ్యూజన్ వద్దు.. గణేశ్ ఉత్సవాలు జరుపుకోండి