
న్యూయార్క్: స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో జోరు చూపెడుతున్నాడు. గత ఎడిషన్‌లోనే రెండో రౌండ్‌లోనే ఓడిన అల్కరాజ్ ఈసారి అలవోకగా మూడో రౌండ్ చేరుకున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6-–1, 6–-0, 6–-3తో వరుస సెట్లలో ఇటలీకి చెందిన 65వ ర్యాంకర్ మాటియా బెల్లుచిని చిత్తుగా ఓడించాడు.
కేవలం గంటన్నరలోనే మాటియా ఆట కట్టించిన రెండో ర్యాంకర్ .. ఒక్కసారి సర్వీస్ కోల్పోలేదు. మరో మ్యాచ్‌లో సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్6-–7 (5/7), 6–-3, 6–-3, 6–-1తో 145వ ర్యాంకర్ అమెరికన్ జచారి స్వజ్దాపై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 4–7, 7–6 (7/3), 6–2, 6–4తో లాయ్డ్ హారిస్ (చెక్)పై నెగ్గగా, అమెరికాకే చెందిన బెన్ షెల్టన్ 6–-4, 6–-2, 6–-4తో కరెనొ (స్పెయిన్)ను ఓడించాడు.
విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 7–-6 (7/4), 6-–2తో పొలిన కుదెర్మటోవా (రష్యా)పై, రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–1, 4–6, 6–4తో లామెన్స్పై నెగ్గి మూడో రౌండ్ చేరారు. జాస్మిన్ పౌలోని, జెస్సికా పెగులా, రిబకినా కూడా రెండో రౌండ్‌లో విజయం సాధించారు.