న్యూయార్క్: కుడి మణికట్టు గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. తన డిఫెండింగ్ టైటిల్‌ను కాపాడుకునేందుకు రీ ఎంట్రీ ఇస్తున్నానని వెల్లడించాడు.
‘ఇక మనం మొదలుపెడదాం’ అంటూ అల్కరాజ్ తన సోషల్ మీడియా వేదికగా యూఎస్ ఓపెన్ లోగో ముందున్న ఫొటోను పంచుకుంటూ టోర్నీలో తన భాగస్వామ్యాన్ని ఖరారు చేశాడు. ఏప్రిల్‌లో జరిగిన బార్సిలోనా ఓపెన్‌లో మణికట్టు గాయానికి గురైన అల్కరాజ్ నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు.
దాంతో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, సిన్సినాటి, టొరంటో టోర్నీలకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత నేరుగా గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగుతున్నాడు. మోకాలి గాయం కారణంగా సిన్సినాటి ఓపెన్‌కు దూరంగా ఉన్న వరల్డ్ నంబర్‌వన్ జానిక్ సినర్ కూడా యూఎస్ ఓపెన్‌పై దృష్టి పెట్టాడు.
