రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధం

రామాయంపేట మండలం కిషన్ తండాలో మద్యపాన నిషేధం

రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం కిషన్ తండాలో గురువారం మద్యపాన నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పటి వరకు నడుస్తున్న బెల్ట్ షాపులు మూసివేయాలని తీర్మానించారు. ఇకపై మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐకి తీర్మాన పత్రం అందచేశారు. కార్యక్రమంలో తండా మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్, గ్రామస్తులు ఉన్నారు.