
Alekhya chitti pickles: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంపై నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ యూట్యూబ్ వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ తనకి సోదరి వరుస అవుతారని తెలిపాడు. అయితే అలేఖ్య కి ఈ మధ్య బీపీ ఎక్కువైందని అందుకే కంట్రోల్ లేకుండా మనుషుల్ని తిడుతుందని, తన చెల్లెళ్ల తరుపున తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపాడు. అలాగే తండ్రి చనిపోవడంతో అలేఖ్య బాగా డిస్టర్బ్ అయ్యిందని దాంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఆరంభంలో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకి తానే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చెయ్యడంలో సహాయం చేశానని కానీ ఆ తర్వాత వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చెయ్యడంతో కోపం వచ్చిందని అందుకే అలేఖ్య సిస్టర్స్ తో మాట్లాడటం మానేశానని తెలిపాడు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ తో వచ్చిన డబ్బుతోనే పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి బాగానే క్లిక్ అయ్యారని కానీ ఒక్క ఆడియో లీక్ తో మొత్తం బిజినెస్ దెబ్బతిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ డ్యామేజ్ తర్వాత అలేఖ్య సిస్టర్స్ ఇక నుంచి పచ్చళ్ళ బిజినెస్ దాదాపుగా మూత పడినట్లేనని చెప్పుకొచ్చాడు. అయితే త్వరలోనే అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య పేరు మీదుగా మళ్ళీ కొత్త బిజినెస్ తో ముందుకు రానున్నట్లు తెలిపాడు. ఇందులో భాగంగా ఈసారి స్వీట్స్ బిజినెస్ మొదలు పెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఏపీలో ఫేమస్ అయిన లడ్డూలు, ఆత్రేయపురం పూత రేకులు, ఇంకా మరిన్ని స్వీట్స్ ని ఎక్కువ ధరలకి కాకుండా అందరికీ అందుబాటులో ఉండేట్లు సరసమైన ధరలకు అందించనున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే కోపం, బీపీ వంటివి కూడా అదుపులో పెట్టుకుని గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని, ఈసారి అలేఖ్య సిస్టర్స్ కి ఈ స్వీట్స్ బిజినెస్ లో తాను కూడా ప్రమోషన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపాడు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అలేఖ్య సిస్టర్స్ కి ఆ దేవుడు సరైన శిక్ష విషించాడని, ప్రస్తుతం అలేఖ్య హాస్పిటల్ ఐసీయూలో ఉందని తెలిపాడు. అలాగే తప్పయిపోయిందని ఇక నుంచి ఇలా మాట్లాడమని, మళ్ళీ ఈ పొరపాట్లు జరగవని అలేఖ్య సిస్టర్స్ అంటున్నారని కాబట్టి ఇకనైనా వాళ్ళని వదిలెయ్యండని కోరాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలని లేదంటే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించాడు.