
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల టైమింగ్స్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో చెప్పినట్లుగానే అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరుగనుండగా.. తాజాగా పరీక్షా సమయాలను మారుస్తూ టీజీపీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గతంలో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్‌సీ).. పరీక్షా సమయాన్ని అరగంట ముందుకు జరిపింది. పరీక్షా సమయ మార్పులను అభ్యర్థులు గమనించగలరు.