విప్​గా బీర్ల ఐలయ్య బాధ్యతల స్వీకరణ

విప్​గా బీర్ల ఐలయ్య బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం రేవంత్ కు, ఇతర నేతలకు ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు. విప్ పదవికి తాను న్యాయం చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఐలయ్యను ఆశీర్వదించారు.