రష్యాలో పుతిన్ సన్నిహితుడి కూతురి హత్య

రష్యాలో పుతిన్ సన్నిహితుడి కూతురి హత్య
  • ఉక్రెయిన్ వార్కు కారకుడైన అలెగ్జాండర్ టార్గెట్గా దాడి

మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు అలెగ్జాండర్ డుగిన కుమార్తె హత్య జరిగింది. కారు బాంబు పేల్చి డార్యా డుగినను హత్య చేశారు. పుతిన్ సన్నిహితుల్లో ఒకరిగా అలెగ్జాండర్ కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా..అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే ప్రాంతంలో భారీ పేలుడు జరిగింది. 

దాడిలో ధ్వంసమైన కారు.. అలెగ్జాండర్ ది. దుండగులకు ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో పుతిన్ను అలెగ్జాండర్ బాగా ప్రభావితం చేశారు. అలెగ్జాండర్ కుమార్తె డార్యా రచయిత. ఆమె ఉక్రెయిన్ పై రాసిన వ్యాసం కారణంగా మార్చిలో విడుదల చేసిన ట్రజెరీస్ ఫీస్ ఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో డార్యాను చేర్చారు.