అల్ఫోర్స్ లో స్టూడెంట్లకు అవేర్నెస్.. విద్యార్థుల్లో నైతిక విలువలు పెరిగేందుకు సదస్సు

అల్ఫోర్స్ లో స్టూడెంట్లకు అవేర్నెస్.. విద్యార్థుల్లో నైతిక విలువలు పెరిగేందుకు సదస్సు

కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు నైతిక విలువలపై ఆసక్తి కలిగి ఉండాలని అల్ఫోర్స్  చైర్మన్  నరేందర్ రెడ్డి సూచించారు. ఆదివారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్  సెంట్రల్  ఆఫీస్ లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ వనజా నరేందర్ రెడ్డి, డాక్టర్  శ్రీదేవి, డాక్టర్  సంగీతరెడ్డి, యోగా గురువు లక్ష్మణ్, సుపథం సంస్థ నిర్వాహకులతో కలిసి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు అవగాహన సదస్సు నిర్వహించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి భగవద్గీత శ్లోకాల పఠనం, సంగీతం, సంస్కృతంపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. సంస్కృతం లెక్చరర్  అరుణ, ప్రిన్సిపాల్, టీచర్లు పాల్గొన్నారు.