వైరల్గా అలీ ఫజల్, రిచా చద్దా వెడ్డింగ్ ఇన్విటేషన్

వైరల్గా అలీ ఫజల్, రిచా చద్దా వెడ్డింగ్ ఇన్విటేషన్

స్టార్ కపుల్ రిచా చద్దా, అలీ ఫజల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తొమ్మిదేళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట.. అక్టోబర్ 4న  వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రేమ పక్షుల వెడ్డింగ్ ఇన్విటేషన్కు సంబంధించి ఫోటో ఇంటర్నెట్ లో వైరల్గా మారింది. అగ్గిపెట్టె ఆకారంలో ఉన్న ఈ పెళ్లి పత్రికపై బ్రాండ్ పేరు ఉండే చోట కపుల్ మ్యాచెస్ రాసి ఉండగా.. అలీ ఫజల్, రిచా చద్దాలు సైకిల్ తొక్కుతున్న ఫొటో ముద్రించారు. ఒకప్పటి అగ్గిపెట్టెలకు అచ్చుగుద్దినట్లున్న ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

అలీ ఫజల్ , రిచా చద్దాల వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్లో జరగనున్నట్లు సమాచారం. వివాహం అనంతరం ఢిల్లీతో పాటు ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలో జరిగే రిసెప్షన్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు షురూ కానుండగా.. కాక్ టెయిల్ పార్టీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లను జోర్దార్గా నిర్వహించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

2015 నుంచి డేటింగ్ లో ఉన్న అలీ ఫజల్, రిచా చద్దాలు 2017లో అఫీషియల్ గా తమ బంధం గురించి ప్రపంచానికి చెప్పారు. నిజానికి 2020లోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటవుతామని ఇటీవలే రిచా ఓ ఇంటర్వూలో చెప్పింది. అందుకు తగ్గట్లుగానే వచ్చే నెలలో ఈ జంట వివాహ బంధంలో అడుగుపెట్టనుంది.