పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు ప్రశంసలతో పాటు బహుమతులు అందుతున్నాయి. తాజాగా అతనికి పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త అలీ షైఖానీ కార్ ను గిఫ్ట్ గా అందజేశాడు. నదీమ్ కు అలీ షైఖానీ కార్ గిఫ్ట్ గా ప్రకటిస్తున్న వార్తను సోషల్ మీడియా ద్వారా JDC అధినేత సయ్యద్ జాఫర్ అబ్బాస్ జాఫ్రీ ఒక వీడియోలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఎన్నో కఠిన పరిస్థితులను దాటుకొని దేశాన్నిఆనందంతో గర్వపడేలా చేశావని.. తను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు సరికొత్త కారు, ఆల్టో అతని కోసం ఎదురు చూస్తుందని ఈ వీడియో ద్వారా తెలిపాడు. జాఫర్ అబ్బాస్ మాట్లాడుతూ.. అర్షద్ నదీమ్ దేశం కోసం ఇంకా ఎక్కువ కీర్తి సాధించాలని.. షైఖానీ చెప్పినట్టు ఈ వీడియోలో పంచుకున్నాడు.
అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం సాధించడంతో వ్యక్తిగత విభాగంలో పాకిస్థాన్ కు తొలి సారి గోల్డ్ మెడల్ లభించింది. అర్షద్ గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు ఒలింపిక్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. గురువారం (ఆగస్ట్) అర్ధ రాత్రి జరిగిన ఫైనల్లో అర్షద్ ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్ విసిరి ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ ఈ ఫీట్ సాధించాడు.