
బాలీవుడ్ అందాల తార అలియా భట్(Alia bhat) తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. కెరీర్లోనే తొలిసారిగా విలన్ పాత్రలో అలియా నటించింది. బాలీవుడ్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ నటి ఇప్పుడు హాలీవుడ్లో తన లక్ చెక్చేసుకోనుంది. అలియా నటించిన ‘హార్ట్ ఆఫ్ స్టోన్(Heart of stone)’ మూవీ ఈ నెల 11న ఓటీటీలో విడుదల కానుంది.
ప్రపంచాన్ని భారీ ప్రమాదం నుంచి కాపాడే ఓ బృందానికి అడ్డంకులు సృష్టించే రోల్లో కనిపించనుంది. ఈ భామ తొలిసారి ఇంగ్లిష్ మూవీలో నటిస్తుండటంతో భారత్‌లోనూ హార్ట్ ఆఫ్ స్టోన్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. యాక్షన్ సీన్స్‌లో ఈ హీరోయిన్ పోటీ పడి నటించిందని టాక్. ప్రాంతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నారు.