ఆకాశంలో వింత.. ఏంటది స్పేస్ షిప్పా..! 

ఆకాశంలో వింత.. ఏంటది స్పేస్ షిప్పా..! 

సెంట్రల్ ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశంలో వింత కనిపించింది. ఎరుపు రంగులో ఓ భారీ వలయాకారం కనిపించింది. అది చూసిన వాళ్లంతా ఏలియన్ స్పేస్ షిప్ వచ్చిందని భయ పడ్డారు. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే మాయలా అనిపించింది. అయితే, దీనికి స్పందించిన ఖగోళ శాస్త్రవేత్తలు.. అది సహజ సిద్దంగా మేఘాల వల్ల ఏర్పడిందేనని, ఏలియన్ స్పేస్ షిప్ కాదని స్పష్టం చేశారు. 

అయితే, ఈ వలయం బినోట్టో ఇటాలియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతం నుంచి క్లీయర్ గా కనిపించింది. దాదాపు 360 కిలో మీటర్ల వ్యాసంతో ఆకాశంలో ఏర్పడింది. ఇవి తక్కువ -ఫ్రీక్వెన్సీ పెర్టర్బేషన్స్ విద్యుదయస్కాంత పల్స్ సోర్సెస్ వల్ల ఏర్పడతాయని, అంకోనా సమీపంలో తుఫాను కారణంగా ఇలా జరిగి ఉంటుందని సైటిస్టులు తెలిపారు.