రామ భక్తి.. అయోధ్య రామమందిరానికి 400 కిలోల తాళం

రామ భక్తి.. అయోధ్య  రామమందిరానికి 400 కిలోల తాళం

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రాముడి ఆలయానికి 400 కిలోల బరువున్న తాళాన్ని సత్య శర్మ అనే వ్యక్తి తయారు చేశారు.  రామ మందిరాన్ని దృష్టిలో ఉంచుకుని 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో నాలుగు అడుగుల తాళం చేసినట్లు శర్మ తెలిపారు.తాళం చేయడానికి దాదాపు రూ.2 లక్షలు ఖర్చయిందని  శర్మ చెప్పారు. దీనిని అలీఘర్‌లోని ఎగ్జిబిషన్‌లో ఉంచారు.

తమిళనాడులోని దిండిగల్ నగరం తాళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందినట్లే, యుపీలో  అలీఘర్ కూడా తాళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. సత్యప్రకాష్ శర్మ ఈ నగరానికి చెందినవారు. తాళాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. రాముడికి అమితమైన భక్తుడైన ఆయన..   రామ మందిరానికి ఏ విధంగానైనా సహాయం చేయాలని భావించారు. అందులో భాగంగా 400 కిలోల బరువున్న తాళం తయారు చేయాలని చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి తన భార్య కూడా తనకు సాయం చేసిందని తెలిపారు.  

 కాగా వచ్చే జనవరిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసి లాంఛనంగా ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో రామమందిరంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది.  ఈ వేడుకకు దాదాపు 10,000 మంది అతిథులను బోర్డు ఆహ్వానిస్తుందని రామమందిర్ బోర్డు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.