ఉప్పల్ మ్యాచ్ కు అంతా రెడీ

ఉప్పల్ మ్యాచ్ కు అంతా  రెడీ

హైదరాబాద్: రేపు ఉప్పల్ జరిగే  భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.  ఆదివారం సాయంత్రం జరిగే ఈ మ్యాచ్ కోసం మొయిన్ వికెట్ ను సిద్దం చేశారు HCA క్యూరేటర్ చంద్రశేఖర్. పిచ్ దగ్గర ఇద్దరు గన్ మెన్ లతో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోని 8 గేట్ల దగ్గర ఫ్యాన్స్ కోసం ప్రత్యేక క్యూ లైన్లు సిద్దం చేశారు. 8 గేట్ల ద్వారా మెటల్, డిటెక్టర్, టికెట్ స్కానింగ్ సెంటర్,చెకింగ్ తర్వాత ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. ఆదివారం సాయంత్రం  నాలుగింటి నుంచి అభిమానులను స్టేడియంలోకి పంపుతారు. మ్చాచ్ కోసం కోసం 2500  మంది పోలీసులతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.  ప్రతి ఎంట్రీ, ఎగ్జిట్, ఎమర్జెన్సీ గేటు దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్టేడియం చుట్టూ 300  సీసీ కెమెరాలతో  పోలీసులు నిఘా పెట్టారు.  

టికెట్ల వ్యవహారంపై విచారణ జరపాలె: HCA మాజీ ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి

ఇక.. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్ల జారీలో HCA వైఫల్యంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. HCAలో తాజా పరిణామాలపై విచారణ జరిపించాలని HCA మాజీ ప్రెసిడెంట్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. HCAలో ఇలాంటి గందరగోళ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టిందని ఆరోపించారు. కవితను HCA ప్రెసిడెంట్ చేయడానికి కేసీఆర్ గేమ్ ఆడి ఫెయిల్ అయ్యారని  వివేక్ అన్నారు.