కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే విధ్వంసమే : హరగోపాల్​ 

కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే విధ్వంసమే : హరగోపాల్​ 

ఖైరతాబాద్​,వెలుగు: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే అంతా విధ్వంసమేనని  ప్రొఫెసర్​హరగోపాల్​పేర్కొన్నారు. గతంలో విద్యకు 6 వేల కోట్లు కేటాయిస్తే..ప్రస్తుతం 2 వేల కోట్లకు తగ్గించి, విద్యా వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. అమెరికా లాంటి దేశాల్లో 90 శాతం ప్రజలకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తుందన్నారు.  భారత్​బచావో ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈనెల 25,26 తేదీల్లో అఖిల భారత విద్యార్థుల సదస్సు సందర్భంగా  గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో  ఆహ్వాన సంఘం చైర్మన్​​అన్వర్​ఖాన్,​ భారత్​బచావో ఉపాధ్యక్షుడు ఇన్నయ్య,ప్రభాకర్​,రమేశ్​​, ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం సదస్సు పోస్టర్​ఆవిష్కరించారు.