హైదరాబాద్‌‌ మెట్రో రైళ్లో ప్యాసింజర్ల కిటకిట

హైదరాబాద్‌‌ మెట్రో రైళ్లో ప్యాసింజర్ల కిటకిట

హైదరాబాద్‌‌, వెలుగు : మెట్రో రైళ్లు, స్టేషన్లన్నీ సోమవారం ప్రయాణికులతో నిండిపోయాయి. నిలబడటానికి కూడా జాగా లేకుండా కిక్కిరిసిపోయాయి. ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ అయ్యే అమీర్‌‌పేట్‌‌ తో పాటు ఇతర స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. అమీర్ పేట మెట్రో స్టేషన్  నుంచి రాయదుర్గం వైపు వెళ్లడానికి ప్రయాణికులు చాలాసేపు  నిరీక్షించారు.

మెట్రో రైల్ కు ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌‌లు సరిపోవట్లేదని, ప్రతి ట్రైన్‌‌కి ఇంకో రెండు కోచ్‌‌లు పెంచాల్సిన అవసరం ఉందని ప్యాసింజర్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా మెట్రో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ట్రెయిన్లు లేట్ గా వస్తున్నాయని తెలిపారు.