కొట్టుకున్న వీహెచ్-నగేశ్ : ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత

కొట్టుకున్న వీహెచ్-నగేశ్ : ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ : ఇందిరాపార్క్ దగ్గర అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. పీసీసీ అధికార ప్రతినిధి నగేష్ ఒకరినొకరు నెట్టుకున్నారు. చిన్న విషయంలో మొదలైన వాగ్వాదం.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది.

వేదికపై వీహెచ్ స్పీచ్ ఇస్తున్న టైమ్ లో అక్కడి కుంతియా వచ్చారు. కుంతియాజీ వేదికపై ఆహ్వానం అంటూ వీహెచ్ ఆయన్ను ఆహ్వానించారు. ఐతే… కుంతియా కంటే ముందే మొదట నగేష్ వచ్చారు. దీంతో.. వీహెచ్ కొంత విసుగ్గా.. నువ్వెందుకొచ్చావ్ ముందు అని అడిగారు. కొంచెం పక్కకు జరగండి.. ఒక్క నిమిషం స్పీచ్ ఆపండి.. వాళ్లను కూర్చోనివ్వండి అని నగేశ్ వీహెచ్ ను అడిగారు. దీంతో.. నగేశ్ భుజంపై చెయ్యి వేసి నువ్వెక్కడ ఆగుతున్నావ్ అంటూ నెట్టేశారు. ‘నాపై ఎందుకు చెయ్యి వేస్తావ్… చెయ్యి ఎందుకు పెడుతున్నావ్ మీద’ అంటూ నగేశ్ సీరియస్ అయ్యారు.. అలా మాటా మాటా పెరిగి.. ఒకరినొకరు తోసుకుని కిందపడేసి కొట్టుకునే స్థాయికి గొడవ పెరిగింది.

కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గొడవ జరిగేటప్పుడు పక్కనే కోదండరాం, కుంతియా, రమణ, చాడ వెంకటరెడ్డి,  మిగతా నేతలు అక్కడే ఉన్నారు. యువనాయకులు వీహెచ్ , నగేశ్ లను వారించడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత సభను కొనసాగించారు.