Actress Sadha: అందాల నటి సదా వెక్కి వెక్కి ఏడ్చింది.. ఎందుకో తెలుసా?

Actress Sadha: అందాల నటి సదా వెక్కి వెక్కి ఏడ్చింది.. ఎందుకో తెలుసా?

ఎల్లవయ్యా..యెళ్లూ.. అంటూ క్యూట్ గా డైలాగ్ చెబుతూ కుర్రాళ్ల మనుసు దోచిన సదా తెలుసుకదా..తొలి సినిమా జయంతోనే తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ భామ.. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.. అయితే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సదా.. వైల్డ్ ఫొటోగ్రాఫర్ గా అవతారమెత్తింది. అంతాబాగానే ఉంది గానీ..ఇటీవల సదాకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది..ఆ వీడియోలో సదా వెక్కి వెక్కి ఏడుస్తోంది.. సదా ఎందుకు ఏడుస్తోంది..? వివరాల్లోకి వెళితే.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sadaa Sayed (@sadaa17)

దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఎక్కడా వీధికుక్కలు కనిపించొద్దు..8 వారాల్లో వీధి కుక్కలనుపట్టి షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎవరైనా అడ్డుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశ  అత్యున్న త న్యాయస్థానం తీర్పుపై సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సదా కుక్కల పరిస్థితిని తలచుకుని  వెక్కి వెక్కి ఏడ్చింది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కేవలం 8 వారాల్లో ఢిల్లీలో ఉన్నవీధికుక్కలను ఎలా తరలిస్తారు.. ఎక్కడ  షెల్టర్ కల్పిస్తారు.. అది జరగని పని.. అన్ని కుక్కలకు ఆశ్రయం కల్పించడం కష్టం..ఛాన్సేలేదు.. వాటిని చంపేస్తారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  ముందుగానే ఢిల్లీ  ప్రభుత్వం మున్సిపల్ అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని  సదా  అన్నారు. 

వీధుల్లో శునకాల పరిస్థితిని ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతుంది.. నాకే ఏం చేయాలో   తోచడం లేదు.. ఎక్కడ ఎలా నిరసన తెలపాలో తెలియడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుతో నా ఆందోళన పెరుగుతోంది.. దయచేసి ఆ తీర్పును వెనక్కి తీసుకోండి అంటూ సదా వెక్కి వె క్కి ఏడ్చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. 
అయితే వీధికుక్కలు తరలింపుపై ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు.. తీవకనంగా వ్యతిరేకిస్తున్నారు.