
ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. టెస్టుల్లో నెంబర్ 1 వన్ బౌలర్ గా బుమ్రా కొనసాగుతున్నాడు. ఈ టీమిండియా స్టార్ పేసర్ పై మాజీ పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ ఖాన్ ఏకంగా వసీం అక్రమ్ కంటే బుమ్రా గొప్పవాడని ప్రశంసలు కురిపించాడు.
బుమ్రాను లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ తో పోలుస్తూ ఆకాష్ చోప్రా ఒక ప్రశ్న వేశాడు. "నేను వకార్ యూనిస్ ను అడిగాను. 'వసీం అక్రమ్ బౌలింగ్ లో ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. అతని బౌలింగ్ ను ప్రపంచమంతా గౌరవిస్తుంది. ప్రపంచ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అక్రమ్ కుడి చేత్తో బౌలింగ్ వేస్తే బుమ్రా లాగే ఉంటుంది. అక్రమ్.. రైట్ హ్యాండ్ తో బౌలింగ్ వేసే బుమ్రా లాంటి వాడు కాదా?'. అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ లో వకార్ యూనిస్ ఖాన్ తో అన్నాడు. ఇందుకు వకార్ స్పందిస్తూ అక్రమ్ కంటే బుమ్రా గొప్ప బౌలర్ అని చెప్పుకొచ్చాడు.
►ALSO READ | Dewald Brevis: బ్రెవిస్ ధనాధన్ సెంచరీ.. గైక్వాడ్, వాట్సన్, డుప్లెసిస్ రికార్డులు ఔట్
చోప్రా ప్రశ్నకు వకార్ యూనిస్ మాట్లాడుతూ.. ఇలా అన్నాడు. " బుమ్రా అందరికంటే బెటర్ బౌలర్. అతని వయస్సులో మనకు ఈ ఆలోచనా స్థాయి లేదు. అతని స్కిల్స్ తో పాటు ఆలోచన అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం ఇప్పటివరకు చూడని బెస్ట్ బౌలర్ అతను". అని యూనిస్ ఈ టీమిండియా పేసర్ పై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత వీరిద్దరి మధ్య ఈ ఇంటర్వ్యూ సంభాషణ జరిగింది. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. పని భారం కారణంగా రెండు టెస్టులు ఆడలేదు.