'జిగ్రీస్' టీజర్‌ లాంచ్‌లో సందీప్ రెడ్డి వంగ.. కామెడీ అదిరిందంటూ ప్రశంసలు

'జిగ్రీస్' టీజర్‌ లాంచ్‌లో సందీప్ రెడ్డి వంగ..   కామెడీ అదిరిందంటూ ప్రశంసలు

'అర్జున్ రెడ్డి', 'యానిమల్'  చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  ప్రస్తుతం ప్రభాష్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న 'స్పిరిట్ ' మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా ఆయన 'జిగ్రీస్'  మూవీ టీజర్ ను లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. తన చిన్ననాటి స్నేహితుడు , నిర్మాత వోడపల్లి కృష్ట నిర్మిస్తున్న ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వోడపల్లి కృష్ట నాకు ఎల్కేజీ నుంచి మిత్రుడు. కానీ నేను వద్దంటానేమోనని చెప్పకుండానే 'జిగ్రీస్'  సినిమా మొదలు పెట్టాడు.  నేను 'యానిమల్' షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, గోవాలో ఒక షెడ్యూల్ పూర్తైందని చెప్పాడు. ఈ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎందుకుని అని అప్పుడే తిట్టేశానని చెప్పారు. అయితే, 'యానిమల్' షూటింగ్ గ్యాప్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు 'జిగ్రీస్' విజువల్స్ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. కొన్ని సీన్లు చూశాను, కామెడీ చాలా బాగుందని చెప్పారు.

 ఈ రోజుల్లో బూతులు లేకుండా కాంటెంపరరీ కామెడీని దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల అద్భుతంగా రాసి, తెరకెక్కించారని సందీప్ రెడ్డి ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన పాటలు కూడా విజువల్స్‌కి చాలా బాగా సూట్ అయ్యాయని చెప్పారు.  త్వరలో విడుదలైయ్యే పాటలకు అందరూ బాగా కనెక్ట్ అవుతారు అని వంగా అన్నారు.  టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలో కామెడీ చాలా ఎక్కువగా ఉంటుందని  సందీప్ రెడ్డి చెప్పారు.

 మన తెలుగు ఆడియన్స్‌కు ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది. సినిమా బాగుంటే చాలు, దానిని బ్లాక్‌బస్టర్‌ చేస్తారని సందీప్ రెడ్డి అన్నారు. ఈ సినిమా కోసం వీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇలాంటి చిన్న సినిమాలను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరారు.  గోవాలో షూటింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్న ఘటనలు, మహారాష్ట్ర బోర్డర్లో ఎదురైన సమస్యలు ఈ కథలో ప్రధానంగా హైలెట్ గా నిలుస్తాయి. ఎంతో రిస్క్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని 'జిగ్రీస్' టీం ను అభినందించారు. ఈ 'జిగ్రీస్' మూవీలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి, వినయ్  ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/OLuxWvjuToc?si=8jwMkkhgCYyy2ifU" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>