
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్న 'బిగ్ బాస్ సీజన్9 'ఈ సారి సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్దమవుతోంది. అయితే ఈసారి కేవలం సెలబ్రిటీలతోనే కాకుండా, సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.
అగ్నిపరీక్ష ఎలా జరుగుతుంది?
బిగ్ బాస్‌కు అప్లై చేసుకున్న వేలాది మందిలో 40 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు . ఈ అగ్నిపరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన ఈ 40 మంది సామాన్యులు పాల్గొంటారు. వీరు తమ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ సామర్థ్యాలను పరీక్షించుకునేలా వివిధ కఠినమైన టాస్క్‌లను ఎదుర్కొంటారు. ఈ టాస్క్‌లలో మూడు గ్రూపులుగా విభజించిన కామనర్స్‌ను గ్రాండ్‌మాస్టర్స్ జడ్జి చేస్తారు. ఈ ముగ్గురు జడ్జిలు ఒక్కో కంటెస్టెంట్‌ను నేరుగా హౌస్‌లోకి పంపిస్తారు. మిగతా వారిలో ప్రజల ఓటింగ్ ద్వారా మరికొంత మందిని ఎంపిక చేసి, ప్రధాన బిగ్ బాస్ 9 షోలోకి పంపిస్తారు.
ఈ అగ్నిపరీక్షలో మూడు లెవెల్స్ ఉన్నాయి. ప్రతి జడ్జికి తమకి నచ్చిన కంటెస్టెంట్‌లకు బ్యాడ్జ్‌లు ఇచ్చే అధికారం ఉంటుంది. ఒక కంటెస్టెంట్‌కు మూడు బ్యాడ్జ్‌లు వస్తే, వారు తదుపరి రౌండ్‌కు అర్హత పొందుతారు. ఒక బ్యాడ్జ్ మాత్రమే వస్తే హోల్డ్‌లో ఉంచుతారు, ఏ బ్యాడ్జ్ రాకపోతే ఇంటికి పంపించేస్తారు. ఈ 'అగ్నిపరీక్ష'కు జడ్జిలుగా అభిజీత్, నవదీప్, బిందు మాధవి వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రత్యేకమైన ఎంట్రీ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' అనే ఒక ప్రీ-షోను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వహకులు రిలీజ్ చేశారు. ఈ షో ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు Jio Hotstar లో స్ట్రీమ్ కానుంది. ఈ "అగ్నిపరీక్ష" షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మొత్తం 15 ఎపిసోడ్‌లలో ప్రసారం కానున్నట్లు సమాచారం.
ఈ కొత్త కాన్సెప్ట్, సీజన్ 9కి ఒక సరికొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తోంది. బిగ్ బాస్ ప్రియులందరూ, తమ అభిమాన గ్రాండ్‌మాస్టర్స్ ఆటను ఎలా ముందుకు నడిపిస్తారో,హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ కామనర్స్ ఎవరు అనేది చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు, ఈ సీజన్‌లో రెండు వేర్వేరు హౌస్‌లు ఉండబోతున్నాయి. ఇది కామనర్స్‌కు , సెలబ్రిటీలకు మధ్య ఒక ఆసక్తికరమైన పోటీని సృష్టించబోతుంది.