
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో అఖిలపక్ష నేతలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించారు. ఆయన పెద్దచెరువు మత్తడిని కబ్జా చేశారంటూ అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పెద్దచెరువును కబ్జా చేసి.. తన కూతురి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. చెరువు దగ్గర ఎమ్మెల్యే కట్టించిన గోడను కూలగొట్టారు. అఖిలపక్ష నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో వివిధ పార్టీల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నేతలు మాత్రం పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చి మరీ ఆందోళనకు దిగారు.
మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద చెరువు దగ్గరికి వచ్చి ఆల్ పార్టీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ముత్తిరెడ్డి బారి నుంచి పెద్దచెరువును కాపాడాలని అడిగితే.. తమపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని అఖిలపక్ష నేతలు అన్నారు. ముత్తిరెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
For More News..