గవర్నర్ ను కలవనున్న అఖిలపక్షం

గవర్నర్ ను కలవనున్న అఖిలపక్షం

సెక్రటేరియట్ కూల్చివేతపై గవర్నర్ ను కలవనున్న అఖిలపక్షం

జులై 7 నాటి సమావేశంలో తీర్మానాలు అందజేయనున్న నేతలు

హైదరాబాద్: సెక్రటేరియట్ కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ నరసింహన్ ను అఖిల పక్ష నాయకులు కలవాలని డిసైడయ్యారు. జులై7 న జి.వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో… ప్రజాస్వామిక తెలంగాణ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలను గవర్నర్ కు అందజేయనుంది అఖిలపక్ష నేతలు.

సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయం పై అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో 6 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు నాయకులు.

  1. సెక్రటేరియట్ భవనాలను.. ఎర్రంమంజిల్ భవనాన్ని కూల్చరాదు.
  2. సెక్రటేరియట్, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలని, కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయరాదని డిమాండ్.
  3. చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఉనికిని కాపాడాలి.
  4. పై డిమాండ్ల సాధనకు గవర్నర్ ను కలిసి మెమోరాండం ఇవ్వాలని, జిల్లాల్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలని సభ నిర్ణయించింది. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలని సభ కోరుతోంది. ప్రత్యక్ష కార్యాచరణకు వెనుకాడమని అఖిల పక్షం ప్రకటించింది.
  5. అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.
  6. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.

ఈ తీర్మానాలను 07.07.19 న జరిగిన ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏకగ్రీవంగా ఆమోదించింది.