దేశ రక్షణ విషయంలో కేంద్రానికి ఫుల్ సపోర్ట్ : అఖిలపక్షం

దేశ రక్షణ విషయంలో కేంద్రానికి ఫుల్ సపోర్ట్ : అఖిలపక్షం

పుల్వామా ఉగ్రదాడి విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. పుల్వామా ఘటన విషయంలో అన్ని పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. పుల్వామా దాడిని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

అఖిలపక్ష సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. పుల్వామా విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయని తెలిపారు. మాకు ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉన్నా రక్షణ విషయంలో అందరిమాట ఒకటేనని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో తమ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు.